మంచిర్యాల జిల్లాలో నలుగురు ఎస్సైల బదిలీలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లాలో పోలీసు శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేస్తూ నలుగురు ఎస్సైలను బదిలీ చేశారు. సీసీసీ నస్పూర్ ఎస్సై మేకల ప్రశాంత్ తాళ్లగురజాలకు, అక్కడ పనిచేస్తున్న ఎస్సై రామకృష్ణ రామగుండంకు బదిలీ అయ్యారు. మంచిర్యాల టౌన్ ఎస్సై శ్రావణ్ కుమార్ కాసిపేటకు, అక్కడ పనిచేస్తున్న ఎస్సై ఆంజనేయులు రామగుండంకు బదిలీ చేస్తూ పోలీస్ యంత్రాంగం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.