తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక: అప్రమత్తంగా ఉండాలని సూచన
రిపోర్టర్: సతీష్
స్థలం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రానున్న కొద్ది గంటలు అత్యంత కీలకమని వాతావరణ కేంద్రాలు స్పష్టం చేశాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.