విద్యార్థులకు పౌష్టికాహారమే లక్ష్యం: బెల్లంపల్లిలో అల్పాహార కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే తెలంగాణ అల్పాహార కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో దీనిని ప్రారంభించారు. ఈ అల్పాహారం విద్యార్థుల ఆరోగ్యం మరియు చదువుపై ఏకాగ్రత పెంపునకు ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.