జాతిపితకు ఘన నివాళి: బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీజీ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మహాత్మాగాంధీ అందించిన సేవలను ఆమె ప్రత్యేకంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు.