జీవీఎంసీ ఎన్నికల వేళ.. కూటమిలో సీట్ల లెక్కలివే!

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపిణీపై స్పష్టత వస్తోంది. మొత్తం 120 వార్డులకు గానూ టీడీపీ 61, జనసేన 45, బీజేపీ 14 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కూటమి ఐక్యతతో విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా జనసేన వ్యూహరచన చేస్తోంది. ఈ సీట్ల సర్దుబాటుతో క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సమన్వయం పెంచి, విజయం సాధించాలని కూటమి నాయకత్వం భావిస్తోంది.