జమ్మూ కాశ్మీర్‌లో ఐదు జిల్లాల్లో హైఅలర్ట్ జారీ చేసిన భద్రతా బలగాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Jammu and Kashmir

జమ్మూ కాశ్మీర్‌లోని కఠువా, సాంబ, ఉధంపూర్, డోడా, కిష్త్వార్ జిల్లాల్లో మజ్తాల్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు హైఅలర్ట్ జారీ చేశాయి. సెప్టెంబర్ 16న భర్తాల్, సోహన్, ఖుబ్బన్ అడవులలో ప్రారంభించిన ఆపరేషన్ సోహన్‌లో జైష్ ఎ మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. గాయపడిన మరో ఉగ్రవాది తప్పించుకోగా, ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా కూంబింగ్ ముమ్మరం చేశాయి.