బాలాపూర్ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కేటీఆర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: బాలాపూర్
బాలాపూర్ మహా గణపతిని దర్శించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ లభించాలని ఆయన మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి నమస్కరించారు.