గుంటూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికలకు సర్వం సిద్ధం

రిపోర్టర్: నరేష్ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. గురువారం పదమూడు మండలాల్ లో పోలింగ్ జరగనుందని, ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు.