ఘాజియాబాద్‌లోని దబా వంటకంలో బొద్దింక లభ్యం కావడంతో తనిఖీలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఘాజియాబాద్

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్ మోహన్‌నగర్‌లోని గరం ధరం ధబా వంటకంలో బొద్దింక లభించడం కలకలం రేపింది. కస్టమర్ ఫిర్యాదుతో ఏడీఎం వినయ్ కశ్యప్ నేతృత్వంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కిచెన్‌లో విపరీతమైన అపరిశుభ్రత, డీప్ ఫ్రీజర్‌లో కీటకాలు గుర్తించారు. ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపిన అధికారులు, కిచెన్‌ను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తూ ధబా నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.