వైసీపీ నేతల అరెస్ట్ కేసులో రవిచంద్రకు రిమాండ్ మరియు ఇద్దరికి బెయిల్
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయవాడ
మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ విజయవాడ శాప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన వైసీపీ నేతలు సుందర్ పాల్, సురేంద్ర, రవిచంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం 307 సెక్షన్ వర్తించదని స్పష్టం చేస్తూ సుందరపాల్, సురేంద్రలకు బెయిల్ మంజూరు చేసింది. అయితే రవిచంద్రకు మాత్రం కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు.