నిజామాబాద్లో యూట్యూబర్ వైష్ణవి హత్యకేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య
రిపోర్టర్: శివ
స్థలం: నిజామాబాద్
నిజామాబాద్ నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తాలో యూట్యూబర్ వైష్ణవి హత్యకేసు నిందితుడు, ఆమె భర్త చిత్తరి హరిబాబును దుండగులు దారుణంగా నరికి చంపారు. మక్కబుట్టలు అమ్ముకుంటున్న సమయంలో కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో తలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో హరిబాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. భార్య వైష్ణవి హత్య కేసులో అరెస్టై బెయిల్పై బయటకు వచ్చిన హరిబాబు హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది.