ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ కస్టడీకి పిటిషన్
రిపోర్టర్: అశోక్
స్థలం: కాకినాడ
కాకినాడలో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య మరియు జగదీశ్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన షేక్ సాదిక్ ఖాన్‌ను మరోసారి పోలీసు కస్టడీకి కోరేందుకు సర్పవరం పోలీసులు సిద్ధమయ్యారు. రాజమహేంద్రవరం జైలులో ఉన్న సాదిక్‌ను మరింత లోతుగా విచారించేందుకు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కాకినాడ మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. మతమార్పిడి వేధింపులు, ఆస్తి బ్లాక్‌మెయిల్ కోణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.