తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కాలయాపన: బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ధ్వజం
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం మూడు నెలలు వృథా చేసి, డీపీఆర్ లేకుండా చర్చలకు వెళ్లడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని ఆరోపించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా తక్షణమే నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.