బెంగళూరు జీవన వ్యయంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్చ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: బెంగళూరు
నెలవారీ సంపాదన లక్ష రూపాయల కంటే తక్కువ ఉంటే బెంగళూరు నగరానికి రావద్దని అత్రేయి అనే యువతి ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నగరంలో ఇళ్ల అద్దెలు, ఆస్తి ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆమె వాపోయారు. అయితే ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ కెరీర్ వృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.