జర్నలిస్టుల రక్షణ చట్టం అమలు చేయాలని ఢిల్లీలో నిరసన

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

జర్నలిస్టుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న ఢిల్లీలోని జంతర్మంతర్లో నిరసన చేపట్టనున్నట్లు టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. జాతీయ పెన్షన్, మీడియా కమిషన్, రైల్వే రాయితీ పాస్లు పునరుద్ధరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.