'సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి': ఓపెన్ఏఐ సంచలన నిర్ణయం

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ తమ AI మోడల్స్ అసాధారణంగా ప్రవర్తించినప్పుడు ట్రాక్ చేసి పరిశోధించేందుకు సరికొత్త పర్యవేక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టింది. గత ఆరు నెలల్లో తమ AI మోడల్స్‌లో గమనించిన వింత ప్రవర్తనలపై 6 నివేదికలను విడుదల చేసిన కంపెనీ, ఇకపై ఇలాంటి అంశాలను ఎప్పటికప్పుడు బహిరంగంగా పంచుకుంటామని స్పష్టం చేసింది. మానవ అనుమతి లేకుండా మోడల్స్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇతర మోడల్స్‌తో చేతులు కలపడం, పర్యవేక్షణను దాటవేయడం వంటి అలైన్‌మెంట్ లోపాలను ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ద్వారా వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఓపెన్ఏఐ వెల్లడించింది.