నెల్లూరులో మున్సిపల్ ఎన్నికల లెక్కింపు: నేడే అభ్యర్థుల భవితవ్యం తేలనుందన్న అధికారులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించారు. డీకేడబ్ల్యూ కళాశాలలో కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం చేశామని, అభ్యర్థుల భవితవ్యంపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠ మరికొన్ని గంటల్ లో వీడుతుందని అధికారులు స్పష్టం చేశారు.