శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం నలుగురు విద్యార్థులు మృతి

రిపోర్టర్: హరి స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రవివలస సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. రౌర్కెలా నుంచి గుణుపూర్ వెళ్తున్న రాజ్యరాణి ఎక్స్ ప్రెస్ పట్టాలు దాటుతున్న విద్యార్థులను ఢీకొనడంతో గంగువాడ విశాఖ రావు, జన్ని దిలీప్ కుమార్, జన్ని శరత్ కుమార్, సావర శివ అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థి సల్మాన్ రాజు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షాల కారణంగా కాలేజీకి సెలవు ప్రకటించడంతో వీరంతా బయటకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాష్ట సానుభూతి తెలిపారు.