నెల్లూరు జిల్లాలో ఆందోళనకరంగా మారుతున్న టీనేజీ ప్రెగ్నెన్సీ కేసులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో బాల్యవివాహాలు మరియు నిరక్షరాస్యత కారణంగా టీనేజీ ప్రెగ్నెన్సీ కేసులు ఆందోళనకరంగా మారుతున్నాయి. పదమూడు నుంచి పంతొమ్మిది ఏళ్ల వయసులో బాలికలు గర్భం దాల్చడం వల్ల శారీరక, మానసిక సమస్యలతో పాటు మాతాశిశు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోనే జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో పాటు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బాల్యవివాహాలు, కౌమార గర్భధారణను అరికట్టేందుకు పంచాయతీ స్థాయిలో యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ నోడల్‌ ఆఫీసర్‌ అనురాధ తెలిపారు.