ఆంధ్రప్రదేశ్‌లో పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం ఎస్‌వోపీ విడుదల చేసింది. సీసీఐ గుర్తించిన కేంద్రాలు, జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తిని సేకరించనున్నారు. ఈ-పంట ఆధారంగా రైతులను గుర్తించి కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ కల్పిస్తున్నారు. పత్తి విక్రయించిన డబ్బులను నేరుగా రైతుల ఆధార్ లింక్డ్ బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. కొనుగోళ్ల పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.