రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్షిఫ్ట్ స్పెషల్ ఎడిషన్ బైక్ విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

తన నూట ఇరవై ఐదు ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పురస్కరించుకుని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ సరికొత్త క్లాసిక్ ఆరు వందల యాభై హైపర్షిఫ్ట్ స్పెషల్ ఎడిషన్ బైక్ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు సంస్థ వెల్లడించింది. భారత్లో దీని ఎక్స్-షోరూమ్ ధరను నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించినట్లు కంపెనీ అధికారులు స్పష్టం చేశారు.