బ్రిక్స్ సదస్సులో పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన సభ్య దేశాలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూఢిల్లీ

న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పహల్గామ్‌ ఉగ్రదాడిని సభ్య దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేస్తూ 'బ్రిక్స్ ఢిల్లీ ప్రకటన' విడుదల చేశాయి. సరిహద్దు ఉగ్రవాదం, ఆర్థిక నిధులు, సురక్షిత స్థావరాలను అంతమొందించాలని, ఐరాస ఉగ్రవాదులపై సమష్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.