జన్మదిన వేడుకలు ఘనం: అనికేపల్లిలో టీడీపీ నేత రాజా యాదవ్ బర్త్డే సంబరాలు
రిపోర్టర్: sai
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి పంచాయతీలో శనివారం తిరుపతి నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల పరిశీలకులు, టీడీపీ మాజీ మండలాధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ జన్మదిన వేడుకలను రాజన్న సైన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేయడంతో పాటు భారీ అన్నదానం నిర్వహించారు.