వైద్య సేవల కుంటుపడటంపై తీవ్ర ఆందోళన: సిబ్బంది కొరతతో ప్రజల అవస్థలు
రిపోర్టర్: Durgam Syam
స్థలం: సీతారామపురం
సీతారామపురం పీహెచ్సీలో సిబ్బంది కొరత తీవ్రమై వైద్య సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాఫ్ నర్సులు లేకపోవడంతో విలేజ్ క్లినిక్ లలో పనిచేసే సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహించాల్సి వస్తోందని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు పూర్తిగా దెబ్బతింటున్నాయని వారు వాపోయారు. అత్యవసరంగా చికిత్స కోసం వస్తున్న పేద రోగుల ఇబ్బందులను గుర్తించి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగిన సిబ్బందిని నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.