రిమ్స్ ఆసుపత్రి అగ్నిప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రిలో అర్దరాత్రి ఏసీ యూనిట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై మంగళవారం రోజున హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదం లో ఇద్దరు చిన్నారులు చనిపోవడం చాల బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి పొన్నం ప్రగాఢ సానుభూతి తెలిపారు.