తుపాను బాధితులకు ఎస్బీఐ భారీ విరాళం: సీఎంకు చెక్ కు అందజేత
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
అర్నబ్ తుపాను బాధితుల సహాయార్థం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ ఉద్యోగులు తమ ఒక్క రోజు వేతనాల ద్వారా సేకరించిన ఐదు కోట్ల ఒక లక్ష రూపాయల భారీ విరాళం చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఉండవల్లి నివాసంలో ఎస్బీఐ ఎండీ అమర రామ్మోహన్ రావు నేతృత్వంలోని అధికారుల బృందం ఈ విరాళం చెక్కును శనివారం ముఖ్యమంత్రికి అందించింది. ఈ సందర్భంగా బ్యాంకు అధికారుల మానవతా దృక్పథాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.