నేలకొండపల్లిలో బీఆర్ఎస్ ధర్నా.. ఆరు గ్యారెంటీలపై నిరసన

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నేలకొండపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చి ప్రజలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

అనంతరం మండల ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో ఎర్రయ్యకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.