నిరుద్యోగ యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్.. ఎప్పటివరకు దరఖాస్తు చేసుకోవాలంటే?
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఆర్.సి. ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో ఉచిత ఆన్లైన్ కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ అయితరాజు అభయేందర్ తెలిపారు. ఎస్ఐ, కానిస్టేబుల్ తో పాటు గ్రూప్-2, 3, 4 తదితర పోటీ పరీక్షలకు నిపుణులైన ఫ్యాకల్టీతో నాణ్యమైన శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.
ఆర్థిక ఇబ్బందులతో కోచింగ్ తీసుకోలేని యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కిరణ్ యువసేన వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 19, 2026 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 83990 99599 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.