నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రజావాణి: 16 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ
రిపోర్టర్: నరేష్
స్థలం: నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 16 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఎస్పీ నాగర్ కర్నూల్ (SP Nagarkurnool) వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వాటిని పరిశీలించి చట్టపరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు పోలీసు శాఖ తరఫున అన్ని విధాలా కృషి చేస్తామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.