తెలంగాణలో రైతుబీమా పోర్టల్ పునరుద్ధరణ, దరఖాస్తుల స్వీకరణ షురూ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో కొత్త ఇందిరమ్మ బీమా అమల్లోకి వచ్చే వరకు పాత రైతుబీమా పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మృతుల నమోదు కోసం వ్యవసాయ శాఖ పోర్టల్‌ను తెరిచింది. ఏఈవోలు మరణించిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఎల్‌ఐసీ ప్రీమియం బకాయిలపై స్పష్టత రాకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం త్వరలోనే నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.