స్మార్ట్ రేషన్ కార్డులు అందుకుని మురిసిపోయిన జన్నారం నిరుపేదలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

జన్నారం గ్రామపంచాయతీలో అర్హులైన లబ్ధిదారులకు సోమవారం సర్పంచ్ అజ్మీర కళావతి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. అర్హులు ఆ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేషన్ దుకాణాల్లో స్మార్ట్ కార్డుల ద్వారానే బియ్యం అందజేస్తారని ఆమె స్పష్టం చేశారు.