లేబర్ బోర్డులో సభ్యత్వం నమోదు ఆఫ్ లైన్ లో కోరుతూ సీఐటీయూ నిరసన

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

నర్సీపట్నం ఏఎల్ఓ కార్యాలయం వద్ద అనకాపల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. లేబర్ బోర్డులో సభ్యత్వం నమోదుకు ఆఫ్లైన్లో అనుమతించాలని, ప్రమాద బీమా పది లక్షలకు పెంచాలని, పెండింగ్ క్లెయిమ్లు విడుదల చేయాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వ ప్రచారాలకు మళ్లించడం సరికాదని హెచ్చరించారు.