రాయలసీమ అభివృద్ధికి సరికొత్త బాట: లక్ష కోట్లతో మెగా హార్టికల్చర్ హబ్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అన్నమయ్య
ఆంధ్రప్రదేశ్ ఉద్యానరంగ రూపురేఖలను మార్చే బృహత్తర ప్రాజెక్టు అయిన రాయలసీమ రైజింగ్కు అమయ్య జిల్లా బీకేపల్లి వద్ద నేడు శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్న ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేసి, రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.