బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన: ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ
రిపోర్టర్: హరి
స్థలం: Bapatla
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పర్యటించారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా అందుతున్న రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.