శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై మంత్రి పొన్నం ఆకస్మిక తనిఖీ

రిపోర్టర్: Damidi Chandra Reddy స్థలం: హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీని బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.