తిరుమలలో వైభవంగా శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ

రిపోర్టర్: మహేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్యదర్శనం ఇచ్చిన శ్రీ మలయప్పస్వామివారిని ప్రముఖులు దర్శించుకుని సేవలో పాల్గొన్నారు. శ్రీవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.