జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవం: మానసిక ప్రశాంతత కోసం పాటించాల్సిన కీలక సూత్రాలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: సంగారెడ్డి

నేటి ఉరుకులు పరుగుల జీవితంలో విపరీతంగా పెరిగిపోతున్న మానసిక ఒత్తిడిని అధిగమించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న వత్తిడి పరిస్థితులను అధికారులు వివరించారు. చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతల కారణంగా పెరుగుతున్న ఆందోళనలను తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటి పద్ధతులను క్రమం తప్పకుండా ఆచరించాలని వైద్యులు స్పష్టం చేశారు.