పవర్ లిఫ్టర్ కీయా కునాల్‌పై సోషల్ మీడియాలో దారుణమైన వేధింపులు
రిపోర్టర్: హరి
స్థలం: India
ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన భారత క్రీడాకారిణి కీయా కునాల్ బానర్జీ తీవ్ర వేధింపులకు గురవుతున్నారు. తన ఫేస్, బాడీని మార్ఫింగ్ చేస్తూ వేల సంఖ్యలో ఏఐ (AI) చిత్రాలను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న లైంగిక వేధింపులు, నకిలీ ఖాతాల సృష్టిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్రీడాకారిణిగా తన గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడుతున్నానని స్పష్టం చేశారు.