ట్రాఫిక్ కష్టాలు పట్టించుకోకుండా: ఆమనగల్లులో నిత్యం చలాన్ల మోత మోగిస్తున్న వైనం
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు పరిష్కరించడంపై దృష్టి పెట్టని పోలీసులు, టార్గెట్ల పేరుతో వాహనదారులపై చలాన్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రధాన జంక్షన్లలో జామ్ తగ్గించడం మాని, చాటుగా ఫోటోలు తీస్తూ ఇష్టానుసారంగా జరిమానాలు విధిస్తున్నారు. పొలాలకు వెళ్లే రైతులు హెల్మెట్లు లేవనే నెపంతో భారీగా చలాన్లు వేస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.