ఆర్టీసీ మెట్రో జాయింట్ పాస్ వివాదం: ఎనిమిది వేల ధరతో ప్రయాణికుల ఆవేదన

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

ఆర్టీసీ మరియు మెట్రో ప్రయాణాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎనిమిది వేల ఐదు వందల రూపాయల జాయింట్ పాస్ ధరపై నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఎలాంటి ముందస్తు అధ్యయనం లేకుండా భారీ ధరతో పాస్లను అందుబాటులోకి తేవడంతో ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదని, ఇప్పటివరకు వంద లోపే జారీ అయ్యాయని వెల్లడించారు. ఈ ధరలను తగ్గించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించినప్పటికీ, సంస్థల మధ్య స్పష్టత కొరవడిందని పేర్కొన్నారు.