నల్లబెల్లిలో విషాదం కాంగ్రెస్ నేత కుటుంబానికి బిర్రు రాజు పరామర్శ
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట మండలం నల్లబెల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బిర్రు మహేందర్ తల్లి బుచ్చమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, శనివారం కాంగ్రెస్ యువ నాయకుడు బిర్రు రాజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి ఓదార్చారు. ఈ సందర్భంగా మానవతా దృక్పథంతో బియ్యం, నూనెను అందజేసి, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.