కూకట్పల్లిలో తీవ్ర కలకలం: భూగర్భ గ్యాస్ పైప్లైన్ పగిలి లీకేజీ
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
కూకట్పల్లి పరిధిలోని బాలాజీ నగర్లో డ్రైనేజీ తవ్వకాల సమయంలో ప్రమాదవశాత్తు భూగర్భ గ్యాస్ పైప్లైన్ పగిలిపోవడంతో తీవ్ర గ్యాస్ లీకేజీ ఏర్పడిందని స్థానికులు తెలిపారు. గ్యాస్ వాసన దట్టంగా వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గ్యాస్ సరఫరాను నిలిపివేసి అత్యవసర మరమ్మతులు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పిందని సాంకేతిక బృందాలు వెల్లడించాయి.