మాజీ ఐపీఎస్ బాలసుబ్రమణ్యం మృతికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రిటైర్డ్ ఐపీఎస్ బాలసుబ్రమణ్యం మృతి పట్ల సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికాలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసు శాఖలో ఆయన అందించిన సేవలను, రవాణా శాఖలో తెచ్చిన సంస్కరణలను చంద్రబాబు కొనియాడారు. పదవీ విరమణ పొందిన కొద్ది రోజులకే ఆయన మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.