తెలుగులో ఉచితంగా మూడు కొత్త సినిమాలు అందించనున్న థియేటర్ ప్లస్ ఓటీటీ
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు తాజాగా మరో కొత్త ఓటీటీ వేదిక అందుబాటులోకి వచ్చిందని, ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఫీ లేకుండా ఉచితంగానే ఈ వారం మూడు సినిమాలను అందిస్తున్నట్లు థియేటర్ ప్లస్ నిర్వాహకులు వెల్లడించారు. గుమాస్తా, నాలుగు వసంతాలు, జై గణేష్ వంటి వైవిధ్యమైన చిత్రాలను ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.