స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్: విజయంపై టీడీపీ నేతలకు దిశానిర్దేశం

రిపోర్టర్: సురేష్ స్థలం: Amaravati

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతి నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రతి పంచాయతీలోనూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆదేశించారు. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ అభ్యర్థులను ఎంపిక చేశామని వెల్లడించారు. ఎన్నికల్లో మిత్రధర్మం పాటించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.