మండాడి సినిమాపై ప్రశంసల జల్లు కురిపించిన నటుడు కమల్హాసన్

రిపోర్టర్: కృష్ణ స్థలం: చెన్నై

మత్స్యకారుల సంప్రదాయ పడవ పోటీల నేపథ్యంలో తెరకెక్కిన మండాడి చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతున్న తరుణంలో అగ్ర నటుడు కమల్హాసన్ చిత్రబృందాన్ని అభినందించారు. మంచి కాన్సెప్ట్తో అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దారని ఆయన ప్రశంసించారు. ఈ అభినందన తమ జీవితంలో ఎప్పటికీ మరువలేని రోజని, ఆయన ఆశీస్సులు ఎంతో ప్రత్యేకమని హీరో సూరి సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.