సాగునీరు అందించాలంటూ గద్వాల కలెక్టరేట్ ముట్టడించిన రైతులు

రిపోర్టర్: రమేష్ స్థలం: Jogulamba Gadwal

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. జూరాల ప్రాజెక్టు కుడి కాలువ కింద ఉన్న భూములకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధరూర్ మండలం జూరాల డ్యామ్ మీద రైతులు ధర్నా నిర్వహించారు. అదేవిధంగా గద్వాల మండలానికి చెందిన పలు గ్రామాల రైతులు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించి తీవ్ర నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.