స్వీట్లు ఇష్టపడే వారికి బిగ్ అలర్ట్: పేణీల తయారీ కేంద్రాలపై దాడులు

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

పండగల సీజన్ సమీపిస్తున్న వేళ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు క్యూర్ పరిధిలోని పన్నెండు పేణీల తయారీ ఖార్ఖానాలపై గురువారం మెరుపు దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఎటువంటి అనుమతులు లేకుండా పేనీలు తయారు చేస్తున్నట్లు గుర్తించామని, ముడిసరుకులను నేలపైనే ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.