ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి: తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం నిరసన

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

వర్షాభావ పరిస్థితులతో పంటలు పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఆదోని ప్రాంతాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఎకరానికి పరిహారం చెల్లించాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేసి తమ నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.