డీఎస్సీ నిరసన కేసు: ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో సంతకం చేసిన ప్రసన్నకుమార్రెడ్డి

రిపోర్టర్: రమేష్ స్థలం: ఇందుకూరుపేట

డీఎస్సీ ఎంపిక అక్రమాల నిరసన ర్యాలీ వివాదానికి సంబంధించి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణలో భాగంగా ఆయన బుధవారం స్టేషన్లో హాజరు పట్టికలో సంతకం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు వైకాపా స్థానిక నాయకులు ఉన్నారు. గతంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే.